Pawan Kalyan: పవన్ నాయకత్వం వర్ధిల్లాలి - జనసేన విక్టరీతో సురేఖా వాణి సెలబ్రేషన్స్
జనసేనకు జై కొట్టిన తెలుగు నటీనటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి సురేఖా వాణి ఒకరు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ విజయాన్ని, జనసేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. (Image Courtesy: artist_surekhavani / Instagram)
నటి సురేఖా వాణి కుమార్తె, త్వరలో వెండితెరకు కథానాయికగా పరిచయం కానున్న సుప్రీతా నాయుడు అయితే పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన జనసేన టీ షర్టును ధరించారు. 'జై జనసేన' అని ఆ టీ షర్టు మీద రాసి ఉంది. (Image Courtesy: artist_surekhavani / Instagram)
జనసేనతో పాటు ఏపీలో అసాధారణ విజయం సాధించిన తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సురేఖా వాణి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. విజేతలకు అభినందలు చెప్పారు. (Image Courtesy: artist_surekhavani / Instagram)
సురేఖా వాణి కుమార్తె సుప్రీతా నాయుడు సోషల్ మీడియాలో మరొక రీల్ షేర్ చేశారు. అందులో 'ఇక మనని ఆపేది ఎవడ్రా' అని పేర్కొన్నారు. మేం పిఠాపురం తాలూకా అని హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. (Image Courtesy: artist_surekhavani / Instagram)
సురేఖా వాణి కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ బిజీ అవుతున్నారు. ఈ ఏడాది ఆమె నుంచి మినిమమ్ మూడు నాలుగు సినిమాలు వచ్చే అవకాశం ఉందని టాక్. (Image Courtesy: artist_surekhavani / Instagram)
కొన్ని రోజులుగా సురేఖా వాణి గుండుతో కనిపిస్తున్నారు. తలనీలాలను ఆమె మొక్కు ఇచ్చారు. అందువల్ల ఈ లుక్ అన్నమాట. (Image Courtesy: artist_surekhavani / Instagram)