JAAT Teaser: బాలీవుడ్ పల్స్ పట్టేసిన టాలీవుడ్ డైరెక్టర్... 600 కోట్ల హీరోతో భారీ యాక్షన్ ఫిల్మ్ - 'జాట్' టీజర్ వచ్చేసింది
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ 'గద్దర్ 2'తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో రూ. 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆయన హీరోగా మన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీస్తున్న సినిమా 'జాట్'. ఈ రోజు ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)
'జాట్' సినిమాలో రణదీప్ హుడా విలన్ రోల్ చేస్తున్నారని టీజర్ చూస్తే ఈజీగా అర్థం అవుతోంది. అలాగే, 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమయే కూడా ఉన్నారు. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)
ప్రజెంట్ నార్త్ ఇండియాలో హిందూ దేవుళ్ళ టచ్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పల్స్ పట్టేశారు గోపీచంద్ మలినేని. అలాగే, మన యాక్షన్ సీన్లు ఎట్రాక్ట్ చేస్తున్నాని ఆ తరహా ఫైట్స్ కూడా డిజైన్ చేశారు. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)
'జాట్' సినిమా టీజర్ లో ఒక దృశ్యం ఇది. రాముని కటౌట్ చూపించిన తర్వాత శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశంలో నడుస్తున్న హీరో. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)
'జాట్' సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వస్తోంది. ఇప్పుడు ఆ సీన్స్ గురించి బాలీవుడ్ మాట్లాడుకుంటోంది. ఈ సినిమాను ఏప్రిల్ 2025న విడుదల చేయనున్నట్లు టీం పేర్కొంది. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)
'జాట్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)
'జాట్' సినిమాలో సన్నీ డియోల్ పెద్ద ఫ్యాన్ తీసుకుని చేసే ఫైట్, అలాగే రెండు భారీ డంబెల్స్ తీసుకుని విలన్ తల పగలగొట్టే సీన్లకు మంచి పేరు వస్తోంది. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)