shruti haasan: వెరైటీ డ్రెస్‌లో శృతి హాసన్ స్టైలిష్ ఫోజులు - 'సలార్' బ్యూటీ గ్లామర్ లుక్‌కి కుర్రకారు ఫిదా
shruti haasan Stylish Look: శృతి హాసన్‌కు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 'లోకనాయకుడు' కమల్ హాసన్ నటవారసురాలికి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తనదైన నటన, స్కిల్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనటిగానే కాదు, సింగర్‌గా, సంగీత దర్శకురాలి మల్టీటాలంట్‌తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఒకపక్క పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే అల్భమ్, కవర్ సాంగ్స్ చేస్తుంది.
ఇటీవల లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించిన ఆమె దీనికి స్వయంగా దర్శకత్వం, స్క్రిప్ట్ కూడా ఆమె అందించింది. ఇలా మల్టీటాలంటెడ్ అయిన శృతి పర్సనల్ లైఫ్‌లో మాత్రం చేదు అనుభవాలు చూస్తుంది.
గతంలో ఓ ఫారెన్ వ్యక్తితో ప్రేమలో మునిగి తేలిన ఆమె ఆ తర్వాత బ్రేక్ చెప్పింది. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
గత నాలుగేళ్లుగా ముంబైలో అతడితో కలిసి సహాజీవనం చేస్తుంది. అతడితో కలిసి దిగిన ఫోటోలు, ఇద్దరు కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకునేది.
అయితే కొద్ది రోజులుగా శృతి బాయ్‌ఫ్రెండ్ గురించి ముచ్చట్లు ఏం చెప్పడం లేదు. అంతేకాదు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కానీ ఏం షేర్ చేయడంతో. తన ఫోటోలు, మూవీ అప్‌డేట్స్ తప్పితే బాయ్ ఫ్రెండ్ ఫోటోలుకానీ, అతడి గురించి ప్రస్తావించడం లేదు.
ఈ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యిందా అని ఆరా తీయగా అతడితో బ్రేకప్ అయ్యిందనే గుసగుస వినిపించింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఒకరినోకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో మళ్లీ శృతి హాసన్ ఒంటరైందంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఈ బ్రేకప్ రూమర్స్ వైరల్ అవుతున్న క్రమంలో తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది ఈ భామ. ఇందులో శృతి తన స్టైలిష్ లుక్‌లో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.