Shilpa Shetty - Ganesh Visarjan 2024: డ్రమ్స్ కొట్టి, అమ్మాయితో డ్యాన్స్ చేసి... గణేష్ నిమజ్జనంలో శిల్పా శెట్టి ధూమ్ ధామ్ సందడి
శిల్పా శెట్టి ఎంత ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారో చూశారా? ముంబైలో ఆదివారం ఆమె ఇంట జరిగిన వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో దృశ్యం ఇది.
కుమార్తె, స్నేహితురాలితో కలిసి శిల్పా శెట్టి చేసిన డ్యాన్స్ అక్కడికి వచ్చిన అతిథులతో పాటు మీడియాను సైతం మెస్మరైజ్ చేసింది. బీట్ కి తగ్గట్టు డ్యాన్స్ చేశారు.
వినాయకుని నిమజ్జనం సందర్భంగా స్టిక్స్ తీసుకుని శిల్పా శెట్టి స్వయంగా డ్రమ్స్ వాయించారు. భక్తి పారవశ్యంలో మునిగారు.
గణేష్ నిమజ్జనానికి ముందు కుమార్తెతో కలిసి ఆ గణనాథుని ముందు శిల్పా శెట్టి.
అమ్మాయితో కలిసి గణేశునికి హారతి ఇస్తున్న శిల్పా శెట్టి. మీరు ఈ ఫోటోలో శిల్ప భర్త రాజ్ కుంద్రాను సైతం చూడవచ్చు.
వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు. తమ ఇంట ఏర్పాటు చేసిన వాటర్ టబ్ లో నిమజ్జనం చేశారు.
శిల్పా శెట్టి నవ్వు చూశారా? ఈ ఒక్క ఫోటో చాలు... ఆమె ఎంత సంతోషంగా ఉంది అనేది చెప్పడానికి