Ram Charan: రామ్ చరణ్ ప్రౌడ్ మూమెంట్ - తండ్రి చిరంజీవికి పద్మ విభూషణ్ అనంతరం చరణ్ ఫస్ట్ రియాక్షన్!
Chiranjeevi Received Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డు ప్రదానోత్సవంలో చిరు రాష్ట్రపతి చేతుల మీదులుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కార్యక్రమానికి చిరంజీవి తన కుటుంబంతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. పద్మ విభూషణ్ అందుకున్న అనంతరం రామ్ చరణ్ భార్య సురేఖ్, కొడుకు రామ్ చరణ్, ఉపాసన, సుష్మితలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఇక ఆ ఫోటోలను షేర్ చేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. Congratulations dad. So proud of you. #padmavibhushanchiranjeevi అంటూ తండ్రిపై అభిమానం కురిపించాడు.
ఇక ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల సైతం తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Congratulations Daddy, a rare and a magnificent moment. Filled with pride and admiration. #padmavibhushan @chiranjeevikonidela అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇక రామ్ చరణ్ పోస్ట్‌కు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల ఆసక్తికర కామెంట్స్ చేశారు. వావ్ మిస్టర్ సి ఫస్ట్టైంలో ఇన్‌టైంలో పోస్ట్ చేశారు అంటూ ఫన్నిగా కామెంట్స్ చేసింది.
ఇక తాజాగా రామ్ చరణ్ మరో పోస్ట్ షేర్ చేశాడు. తన తండ్రితో పాటు పద్మ విభూషణ్ అవార్డుతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ప్రస్తుతం చరణ్ పోస్ట్ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.