Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు

'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రకుల్ ప్రీత్ సింగ్
శంకర్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారు హీరోగా నటించిన 'ఇండియన్ 2' / 'భారతీయుడు 2' సినిమాలో నటించడం తనకు ఎంతో గర్వంగా ఉందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.
'భారతీయుడు 2' సినిమాలో సిద్దార్థ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే. అతడొక అద్భుతమైన నటుడని, అతనితో మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.
జూలై 12న థియేటర్లలో 'భారతీయుడు 2' విడుదల అవుతున్న సందర్భంగా ఆదివారం (జూలై 7న) హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ దుస్తుల్లో సందడి చేశారు.
'భారతీయుడు 2' సినిమాలో నటీనటులు అందరినీ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ చక్కగా చూపించారని రకుల్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు అందరూ జూలై 12న సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలని ఆమె కోరారు.
నిజం చెప్పాలంటే... పెళ్లికి ముందు రకుల్ ప్రీత్ సింగ్ అంగీకరించిన సినిమాల్లో 'భారతీయుడు 2' ఒకటి. కరోనాతో పాటు పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యింది.
'భారతీయుడు 2'తో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకు మళ్లీ పూర్వ వైభవం రావడం ఖాయమని రకుల్ ప్రీత్ సింగ్ భావిస్తున్నారట.