Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ రామ్ శారీ ఫోటోస్... పొట్టి పిల్ల ఎంత అందంగా ఉందో!
Kavya Kalyanram Latest Photos: చీర కడితే ఏ అమ్మాయి అయినా సరే అందంగా ఉంటుందని అందరూ చెప్పే మాట. శారీలో కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు చూస్తే ఎవరైనా ఆ మాటే అంటారు. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు సూపర్ హిట్. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆమె చేసిన సినిమాలు హిట్టు. సైజ్ జీరో పెర్సనాలిటీతో కాకుండా నటనతో అందరినీ మెప్పిస్తున్న భామ కావ్య. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
కావ్య కళ్యాణ్ రామ్ కథానాయికగా నటించిన మొదటి సినిమా 'మసూద'. ఆ హారర్ ఫిల్మ్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత 'బలగం' సినిమా చేశారు కావ్య. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
'బలగం' సినిమాలో ప్రియదర్శి జోడీగా కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. ఫ్యామిలీ ఎంటరైనర్ అయినా సరే అందులో ప్రియదర్శి, కావ్య మధ్య 'పొట్టి పిల్ల' సాంగ్ ఉంది. అది మంచి హిట్ అయ్యింది. కావ్యను చాలా మంది ఫ్యాన్స్ సరదాగా 'పొట్టి పిల్ల' అంటుంటారు. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
కావ్య కళ్యాణ్ రామ్ నటనతో పాటు చదువును కూడా నెగ్లెక్ట్ చెయ్యలేదు. ఆవిడ లా చేశారు. లాయర్ చదివిన హీరోయిన్లలో కావ్య కూడా ఒకరు. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
'ఉస్తాద్' తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ మరొక సినిమాకు సంతకం చేయలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, కావ్య నటనకు మంచి పేరు వచ్చింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)