Nenevaru Movie: విడుదలకు సిద్ధమైన రాజేంద్ర ప్రసాద్ 'నేనెవరు?'... కీలక పాత్రలో జోగిని శ్యామల... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహించిన సినిమా 'నేనెవరు?'. ఇదొక సందేశాత్మక వినోదభరిత సినిమా. జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు.
'నేనెవరు?' సినిమాలో జోగిని శ్యామల ఓ ముఖ పాత్ర పోషించారు. 'నువ్వే కావాలి', 'ప్రేమించు' వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ చేసిన సాయి కిరణ్ మరొక ప్రధాన పాత్రధారి. వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయి చెర్రి హీరోలుగా పరిచయం అవుతున్నారు. దీపికా, సోనాక్షి, 'జబర్దస్త్' రాజమౌళి ఇతర పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
'నేనెవరో' విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు - ప్రముఖ నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వి. సముద్ర ఆవిష్కరించారు.
Nenevaru Movie Cast And Crew: 'నేనెవరో' సినిమాకు మాటలు: శ్రీనివాస్, పాటలు: ఎస్ఎస్ వీరు, సంగీతం: చిన్నికృష్ణ, కూర్పు: నందమూరి హరి - తారక రామారావు, ఛాయాగ్రహణం: నాయుడు ప్రసాద్ కొల్లి, సమర్పణ: సరికొండ మల్లిఖార్జున్, నిర్మాతలు: అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి, రచన - దర్శకత్వం: చిరంజీవి తన్నీరు.