Pushpa 2 Collection: ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఫైర్ కాదు... వైల్డ్ ఫైర్ అంటూ 'పుష్ప 2'లో డైలాగ్ రాశారు క్రియేటివ్ జీనియస్ సుకుమార్. బాక్స్ ఆఫీస్ బరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సత్తా చెప్పడం గురించి ఆ మాట సరిపోతుంది. (Image Courtesy: pushpamovie / Twitter)
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో ఓపెనింగ్ డే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా 'పుష్ప 2' రికార్డు సాధించిందని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అనౌన్స్ చేశారు. మొదటి రోజు తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లు కలెక్ట్ చేసిందని పేర్కొన్నారు. (Image Courtesy: pushpamovie / Twitter)
హిందీలోనూ 'పుష్ప 2' రికార్డులు సాధించింది. హిందీలో ఈ సినిమా 72 కోట్ల రూపాయలు సాధించిందని చిత్ర బృందం వెల్లడించింది. (Image Courtesy: pushpamovie / Twitter)
సాధారణంగా ఫ్రైడే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ, 'పుష్ప 2' గురువారం విడుదలైంది. హిందీలో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తుండగా... గ్లోబల్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. ఫ్రైడే బుకింగ్స్ సైతం చాలా బావున్నాయి. (Image Courtesy: pushpamovie / Twitter)
ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి రూ. 500 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. (Image Courtesy: pushpamovie / Twitter)