Pooja Hegde: పూజ హెగ్డే రెడ్ అలర్ట్ - ఈ బుట్టబొమ్మను ఇలా చూస్తే చూపు తిప్పుకోలేరంతే..
Pooja Hegde Photos: 'బుట్టబొమ్మ' పూజ హెగ్డే రెడ్ అలర్ట్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ ఫ్యాన్సీ చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది.
ప్రస్తుతం పూజ హెగ్గే ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అవును.. పూజను ఇలా చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే, క్యాప్షన్ సరిగ్గా సెట్ అయ్యిందంటూ ఆమెపై పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాయి.
ప్రస్తుతం పూజ లేటెస్ట ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మధ్య తెలుగులో పూజ హెగ్డే సందడి కరువైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఈ భామ కినిపించి చాలా గ్యాప్ వచ్చింది.
ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న పూజను ఇప్పుడు దర్శక-నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరిగా ఆమె ఆచార్యలో కనిపించింది. ఆ తర్వాత ఎఫ్ 3లో గెస్ట్ అప్పియరెన్స్.
ఇక ఇప్పటి వరకు ఆమె ఒక్క తెలుగు సినిమాలో నటించలేదు. ప్రాజెక్ట్స్‌లో ప్రకటించలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసిన పూజ అక్కడ ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నం చేస్తుంది.