Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు - పింక్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న 'ఖిలాడి' భామ
Sneha Latha | 28 Aug 2024 03:37 PM (IST)
1
Meenakshi Chaudhary Latest Photos: 'ఖిలాడి' బ్యూటీ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పింక్ సల్వార్ సూట్‌లో ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో క్యూట్‌గా నవ్వుతూ కుర్రాళ్ల మతిపోగోడుతుంది.
2
ఇక మీనాక్షి లేటెస్ట్ లుక్ నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మీనాక్షి ఖిలాడీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ ప్లాప్ అయినా ఈ అమ్మడికి మాత్రం వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
3
ఆ తర్వాత హిట్ 2లో కనిపించి మెప్పించింది. అనంతరం మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో సెకండ్ హీరోయిన్ చాన్స్ అందుకుంది. కానీ ఈ భామకు ఆశించిన గుర్తింపు రాలేదు.
4
అయినా కూడా తన అందం, అభినయంతో ఇతర ఇండస్ట్రలోనూ అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఆమె దళపతి విజయ్ 'ది గోట్' చిత్రంలో నటిస్తుంది.