Krishna Birthday: ‘మీలా మరెవ్వరూ ఉండరు నాన్న’ కృష్ణకు మహేష్ బాబు ఎమోషనల్ విషెస్!
తెలుగు చిత్ర సీమకు కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసిన ఏకైనా సినీ దిగ్గజం ఘట్టమనేని కృష్ణ. - Image Credit: Mahesh Babu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు తెరకు తొలిసారి జేమ్స్ బాండ్(గూఢచారి 116)ను పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణయే. - Image Credit: Mahesh Babu/Instagram
‘మోసగాళ్లకు మోసగాళ్లు’ చిత్రంతో తొలి కౌబాయ్ చిత్రాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా సూపర్ స్టారే. - Image Credit: Mahesh Babu/Instagram
తొలి ఫుల్ స్కోప్ (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన ప్రయోగాలకు అంతేలేదు. - Image Credit: Mahesh Babu/Instagram
చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమకు ట్రెండ్ సెట్టర్ కృష్ణ. ఈ రోజు ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కృష్ణకు అంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. - Image Credit: Mahesh Babu/Instagram
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. - Image Credit: Mahesh Babu/Instagram
‘‘హ్యాపీ బర్త్ డే నాన్న. మీలాంటివారు నిజంగా ఎవరూ లేరు నాన్న. మీరు రానున్న రోజుల్లో మరింత ఆరోగ్యం, సంతోషంతో జీవించాలని కోరుకుంటున్నా. లవ్ యూ’’ అని మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ చేశాడు. - Image Credit: Mahesh Babu/Instagram
‘‘చాలా ఏళ్లుగా మీతో నాకు ఎన్నో ఇష్టమైన జ్ఞాపకాలున్నాయి. మీరు నా జీవితంలో చాలా ప్రేమ, దయ, ఆనందానని తీసుకొచ్చారు. నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞతరాలిని. మీరు నా భర్తకు, నాకు.. మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మామయ్యా. వియ్ లవ్ యూ’’ అని నమ్రతా శిరోద్కర్ వెల్లడించారు. కృష్ణతో గౌతమ్, సితార కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. - Image Credit: Mahesh Babu/Instagram
మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార కూడా ఇన్‌స్టా వేదికగా తన తాత కృష్ణకు పుట్టిన రోజు విషెస్ చెప్పింది. మీరు కోటిలో ఒక్కరు తాతగారు అని గౌతమ్ విష్ చేశాడు. - Image Credit: Mahesh Babu/Instagram