Keerthy Suresh: కీర్తీ సురేష్ చీరలో ఏముందిరా బాబూ... రఘు తాత కోసం మహానటి ఇలా వచ్చింది మరి
Keerthy Suresh In Saree: కీర్తీ సురేష్ చీర కడితే చూడటానికి రెండు కళ్లు సరిపోవు అసలు. 'మహానటి'లో సావిత్రి పాత్రలో జీవించిన అమ్మాయికి సంప్రదాయ ఆరు గజాల చీరలో ఎలా కనిపించాలో తెలియదూ! కీర్తి లేటెస్ట్ శారీ ఫోటోల మీద ఓ లుక్ వేయండి. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ సినిమా 'రఘు తాత'. 'కెజిఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సూపర్ డూపర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ప్రొడ్యూస్ చేసిన హోంబాలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం కీర్తీ సురేష్ ఇలా శారీలో సందడి చేశారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
రీసెంట్గా 'రఘు తాత' లాంచ్ చేశారు. ఆ వేడుకలో కీర్తీ సురేష్ శారీలో సందడి చేశారు. అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు అనుకోండి. ఆ తర్వాత జరిగిన మరొక కార్యక్రమానికి సైతం కీర్తీ సురేష్ చీర కట్టడం విశేషం. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
'రఘు తాత' సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఇప్పటి నుంచి ఆ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు కీర్తి. బిజీ బిజీ ప్రమోషన్ ప్రోగ్రాంల మధ్య గ్యాప్ తీసుకుని కారులో షికారుకు వెళుతున్నారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
'రఘు తాత' కాకుండా హిందీ సినిమా 'బేబీ జాన్'లో కూడా కీర్తి సురేష్ నటించారు. ఆ సినిమాలో వరుణ్ ధావన్ హీరో. అది డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
కీర్తి సురేష్ చేతిలో 'రివోల్వర్ రీటా', 'కన్నివేడి' అని మరో రెండు తమిళ సినిమాలు సైతం ఉన్నాయి. మరి, అవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో? (Image Courtesy: keerthysureshofficial / Instagram)