Indian 2 Trailer: ఇండియన్ 2 ట్రైలర్ లాంచ్‌కి టైమ్ ఫిక్స్ - భారతీయుడిగా కమల్ హాసన్ కొత్త స్టిల్స్ చూశారా?
Bharateeyudu 2 Trailer: లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తాజా సినిమా 'ఇండియన్ 2' (Indian 2 Movie). తెలుగులో దీనిని 'భారతీయుడు 2' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇవాళ ట్రైలర్ విడుదల కానుంది. ఆ అప్డేట్ ఏమిటంటే?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజూన్ 25వ తేదీ (ఈ రోజు, మంగళవారం) సాయంత్రం ఏడు గంటలకు 'ఇండియన్ 2' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. తమిళం, తెలుగుతో పాటు హిందీ భాషలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. సినిమా కూడా ఈ మూడు భాషల్లో విడుదల కానుంది.
తెలుగులో 'భారతీయుడు 2'గా... తమిళ, హిందీ భాషల్లో 'ఇండియన్ 2'గా జూలై 12న సినిమా థియేటర్లలోకి వస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా... తెలుగు ('భారతీయుడు 2') థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు సొంతం చేసుకున్నాయి.
'ఇండియన్ 2' సినిమా విడుదలై 28 ఏళ్లు. ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాలో మరోసారి భారతీయుడిగా కమల్ హాసన్ సందడి చేయనున్నారు.
'భారతీయుడు 2'లో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. అయితే, రెండు పార్టులుగా సినిమాను విడుదల చేయాలని అనుకోవడంతో కాజల్ రోల్ మూడో పార్ట్ 'ఇండియన్ 3'లోకి వెళ్ళింది. ఆ విషయాన్ని శంకర్ కూడా చెప్పారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జంటగా నటించారు.
'ఇండియన్ 2'లో సిద్ధార్థ్ రోల్ కీలకం అని, ఇంటర్వెల్ వరకు స్క్రీన్ మీద ఆయన ఉంటారని... కమల్ పాత్ర విశ్రాంతికి కొంతసేపటి ముందు ఎంటర్ అవుతుందని తెలిసింది.