Chiranjeevi Movie Child Artist: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ - ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Jai Chiranjeeva Child Artist: మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అల్లరి చేసిన లావణ్య ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
Download ABP Live App and Watch All Latest Videos
View In App'మావయ్య.. మావయ్య' అంటూ ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈ అల్లరి పిల్ల తన క్యూట్ క్యూట్ స్మైల్ మాటలతో అందరిని మెప్పించింది.
ఈ క్రేజ్‌తో ఆమె వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో బాలనటిగా ఆఫర్స్ అందుకుంది. 'జై చిరంజీవ' సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఈమెకు తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, హిందీ భాష చిత్రాల్లోనూ ఆమె బాలనటిగా అలరించింది.
ఆమె అసలు పేరు శ్రియా శర్మ. ప్రస్తుతం ఆమె వయసు 26 ఏళ్లు. ఇటీవల న్యాయశాస్త్రం పూర్తి చేసిన ఆమె పలు కార్పొరేట్ కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది.
బాలనటిగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న శ్రియా శర్మ.. హీరోయిన్గా ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేయలేకపోయింది.
'రచ్చ','తూనీగ తూనీగ','ఎటో వెళ్లిపోయింది మనసు' వంటి సినిమాల్లో టీనేజ్ గర్ల్‌గా నటించిన ఆమె గాయకుడుతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది.
ఆ తర్వాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో జతకట్టింది. నిర్మలా కాన్వెంట్ చిత్రంలో నటించిన ఆమెకు ఈ సినిమా కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది.
వరసగా ప్లాప్స్ రావడం, అవకాశాలు కూడా రాకపోవడంతో నటనకు బై చెప్పి స్టడీస్‌పై దృష్టి పెట్టింది. శ్యాయశాస్త్రం పూర్తి చేసిన ఆమె పెద్ద పెద్ద కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తుంది.
సినిమాల్లో క్యూట్ క్యూట్ స్మైల్ లుక్స్‌తో ఆకట్టుకున్న శ్రియా ప్రస్తుతం బొద్దుగా గుర్తుపట్టేలేనంతగా మారింది. ప్రస్తుతం లేటెస్ట్ లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.