Singer KK: కేకే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా...?
ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కేకే సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. అమ్మ పాడే మలయాళీ సాంగ్స్‌ని వింటూ ఆ స్ఫూర్తితోనే పాటలు పాడటం నేర్చుకున్నాడు. - Image Credit: KK Live/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ క్లాసిక్ షోలే సినిమాలోని మెహబూబా పాట కేకేకి ఎంతో ఇష్టం. స్కూల్ డేస్‌లో ఫ్రెండ్స్ అడిగి మరీ కేకేతో ఈ పాట పాడించుకునే వారు. - Image Credit: KK Live/Instagram
రెండో తరగతిలోనే స్టేజ్ షో ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు కేకే. అప్పటి నుంచే సింగింగ్ వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. - Image Credit: KK Live/Instagram
కేకే సింగింగ్ నే కెరీర్ గా ఎంచుకోవటాని కన్నా ముందు సేల్స్ మెన్‌గా ఆర్నెల్ల పాటు పని చేశాడు. తరవాత ఆ ఉద్యోగం మానేసి కీబోర్డ్ కొనుక్కుని జింగిల్స్ చేయటం మొదలు పెట్టాడు - Image Credit: KK Live/Instagram
అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కేకే, సినిమాల్లోకి రాక ముందు సుమారు ౩వేల జింగిల్స్‌కి తన స్వరం అందించాడు. - Image Credit: KK Live/Instagram
1985లో తన జింగిల్ టీవీలో టెలికాస్ట్ అవటం చూసి చాలా మురిసిపోయాడు కేకే. అప్పుడే 500 రూపాయల తొలి పారితోషికం అందుకున్నాడు. - Image Credit: KK Live/Instagram
తడప్ తడప్ పాటతో వెలుగులోకి వచ్చినా అంతకు ముందు చోడ్ ఆయే హమ్ అనే పాటలో మొదటి రెండు లైన్లు పాడి సింగింగ్ కెరీర్‌ని ప్రారంభించాడు కేకే. - Image Credit: KK Live/Instagram
దాదాపు రెండు దశాబ్దాలకుపైగా తన పాటలతో అలరించిన కేకే కేవలం ఒక్కసారి మాత్రమే ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా పురస్కారం అందుకున్నాడు. అవార్డుల విషయంలో తానెప్పుడూ అసంతృప్తిగా లేనని మంచి పాటలు పాడుతున్నానన్న సంతృప్తి చాలని చాలా సందర్భాల్లో చెప్పాడు కేకే. - Image Credit: KK Live/Instagram