హాట్ సమ్మర్ లో హీట్ పెంచేస్తున్న 'సామజవరగమన' బ్యూటీ!
అందాల భామ రెబా మోనికా జాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేకపోవచ్చు. బెంగుళూరుకు చెందిన ఈ బ్యూటీ.. ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆకట్టుకునే అందం, అభినయంతో తొలి సినిమాతోనే మాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'జరుగండి' అనే తమిళ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా.. విజయ్ హీరోగా నటించిన 'విజిల్' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. యాసిడ్ దాడికి గురైన ఫుట్ బాల్ క్రీడాకారిణిగా అద్భుతమైన నటన కనబరిచింది. ఆ తర్వాత 'FIR' చిత్రంలో హీరోయిన్ గా అలరించింది.
'జెర్సీ' సినిమాలో నాని సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు ఇప్పుడు శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న 'సామజవరగమన' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.
రెబా మోనికా గార్జియస్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు కజిన్ అవుతుంది. ఆమె 2022లో తన బాయ్ ఫ్రెండ్ జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రెబా కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేయదని అందరూ భావించారు. కానీ తన నటనా జీవితాన్ని కొనసాగిస్తానని చెప్పి, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కమిటైంది.
ప్రస్తుతం రెబా 'సామజవరగమన' సినిమాతో పాటుగా 'రజిని' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. అలానే 'షకలక వల్లభ' అనే కన్నడ మూవీ & 'అక్టోబర్ 31స్ట్ లేడీస్ నైట్' అనే తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమా చేస్తోంది.
రెబా మోనికా హాలిడే కోసం తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళింది. ఇంస్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ టూర్ విషయాలను వెల్లడిస్తోంది.