Happy Birthday Priyamani: ప్రియమణి బర్త్‌డే స్పెషల్ - ఇంతకి ఈ భామ పూర్తి పేరు ఏంటో తెలుసా?

Happy Birthday Priyamani: హీరోయిన్ ప్రయమణి బర్త్‌డే. జూన్ 4న ఆమె పట్టిన రోజు. నేటి ప్రియమణి 40వ పడిలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ప్రియమణికి ఫ్యాన్స్, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
నాలుగు పదుల వయసులోనూ ప్రియమణి తనదైన గ్లామర్, అందంతో ఆకట్టుకుంటుంది. హీరోయిన్గా, పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్, వైవిధ్యమైన సినిమా, గ్లామర్, ఢిగ్లామర్, స్పెషల్ సాంగ్స్ ఇలా అల్‌రౌండర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

ఆ మధ్య కెరీర్ డౌప్ అయినా మళ్లీ రీఎంట్రీలో వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకసారి ప్రియమణి సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేయండి. ప్రియమణి జూన్ 4, 1984న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించారు.
తండ్రి వసుదేవ మని అయ్యర్, తల్లి లతా మణి అయ్యార్. ప్రియమణి పూర్తి పేరు ప్రియ వసుదేవ మణి అయ్యార్. విద్యాభ్యాసం మొత్తం ఆమె కేరళలోనే చేశారు. బీఏ చదివిన ఆమె సినిమాలో ఆసక్తితో మోడలింగ్ చేశారు.
ఈ క్రమంలో తెలుగులో 'ఎవరే అతగాడు' (2003) సినిమాతో హీరోయిన్గా ఆరంగేట్రం చేశారు. ఈ చిత్రం ఆమెకు ఆశించిన గుర్తింపు ఇవ్వలేకపోయింది. దీంతో తమిళంపై దృష్టి ఆమె 'పెళ్ళైనకొత్తలో' చిత్రం రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆమె ఆ వెంటనే తెలుగులో మూడు సినిమాలకు సైన్ చేసింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన 'యమదొంగ'తో భారీ హిట్ కొట్టింది. అప్పటి డీసెంట్ పాత్రలు చేసిన ప్రియమణి ద్రోణా చిత్రంలో గ్లామర్ షో చేసి షాకిచ్చింది.
ఆ తర్వాత గోలిమార్లో.. మగాళ్లు మాయగాళ్లంటూ అలరించింది. ఆ తర్వాత ఆమె కెరీర్ కాస్తా డల్ అయ్యింది. ఇక సినిమాకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ప్రియమణి 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ డిగ్లామర్ రోల్లో కనిపించింది. అలాగే ఆడపదడపా సినిమాలు చేస్తూ లేడీ ఒరియంటెడ్ సినిమాలవైపు దృష్టి పెట్టింది.
అలా ప్రియమణి ఒక్క గ్లామర్ పాత్రకే సొంతం కాకుండా పాత్రలతో ప్రయోగాలు చేసింది. అలా క్షేత్రం, చారులత, చండి వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసింది. విరాటపర్వం నక్సలైట్‌గా నటించిన ఆమె మరోవైపు కింగ్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది.. 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది.
రీసెంట్గా భామా కలాపం వంటి లేడీ ఒరియంటెడ్ వెబ్ సిరీస్‌లో అలరించింది ఈ సౌత్ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ అలరిస్తుంది. డ్యాన్స్ షోలోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.