Eesha Rebba: నిషా ఎక్కిస్తోన్న ఇషా - నీ అందాలకు కుర్రకారు దాసోహం, పెద్ద ప్లానే వేశావుగా!
ఇషా రెబ్బాకు అందం, టాలెంట్ రెండూ ఉన్నాయ్. కానీ, మన టాలీవుడ్ దర్శక నిర్మాతలకే.. ఆమెకు బ్రేక్ ఇవ్వడం చేత కావడం లేదు. ఇక్కడ అవకాశాలు ఇవ్వడం లేదని ఈ బ్యూటీ తమిళం, మలయాళం మూవీస్‌లో కూడా ప్రయత్నాలు చేసింది. కానీ, అక్కడా లక్ కలిసి రాలేదు. సరైన్ హిట్స్ దక్కలేదు. చివరికి లిప్ లాక్ సీన్స్‌తో కూడా షాకిచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. అయితే, అప్పుడప్పుడు వెబ్ సీరిస్‌లతో ఆకట్టుకుంటోంది ఇషా. బోల్డ్.. హోమ్లీ.. ఇలా ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోతూ అలరిస్తోంది. తాజాగా ఇషా.. కత్తిలాంటి లెహంగాలో ప్రత్యక్షమైంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేందుకు పెద్ద ప్లానే వేసింది. (Images Credit: Eesha Rebba/Instagram)
ఇషా చివరిగా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న.. ‘దయా’ వెబ్ సీరిస్‌లో కనిపించింది. ఇందులో జేడీ చక్రవర్తికి భార్యగా నటించింది. (Images Credit: Eesha Rebba/Instagram)
అలాగే గతేడాది సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మామా మశ్చింద్రా’ మూవీలో తళుక్కున మెరిసింది. కీలక పాత్రలో నటించినా.. మూవీ హిట్ కొట్టకపోవడంతో మళ్లీ అవకాశాలు రాలేదు. (Images Credit: Eesha Rebba/Instagram)
ఇషా ప్రస్తుతం ‘దయా’ వెబ్ సీరిస్ సీక్వెల్‌లో నటిస్తోంది. అయితే, ఆమె ఇంకా ఏయే సినిమాలు, సీరిస్‌ల్లో నటిస్తోందనే సమాచారం తెలియరాలేదు. అయితేనేం.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్‌గా కనిపిస్తూ అలరిస్తూనే ఉంటుంది. (Images Credit: Eesha Rebba/Instagram)
ఇషా టాలీవుడ్‌లో అడుగుపెట్టి సుమారు 12 ఏళ్లు కావస్తోంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో ఇషా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. (Images Credit: Eesha Rebba/Instagram)
ఇషా రెబ్బా ఇప్పటివరకు సుమారు 10కి పైగా సినిమాలు, 4 వెబ్ సీరిస్‌ల్లో నటించింది. (Images Credit: Eesha Rebba/Instagram)