Deepika Padukone : లేడీ సింగం శక్తి శెట్టిని చూశారా? - 'సింగం ఎగైన్'లో దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్
లేడీ సింగం శక్తి శెట్టి పాత్రలో దీపికా పదుకోన్ సందడి చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న తాజా సినిమా 'సింగం ఎగైన్'. అందులో ఆమె కూడా పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ రోజు శక్తి శెట్టిగా దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. (Image Courtesy : deepikapadukone / instagram)
రోహిత్ శెట్టి కాప్ (పోలీస్) ఫ్రాంచైజీలో ఐదో చిత్రమిది. ఇంతకు ముందు 'సింగం', 'సింగం రిటర్న్స్', 'సింబ', 'సూర్యవంశీ' సినిమాలు చేశారు. ఇప్పుడీ 'సింగం రిటర్న్స్' ఐదో సినిమా. (Image Courtesy : deepikapadukone / instagram)
రోహిత్ శెట్టి దర్శకత్వంలో దీపికా పదుకోన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' పెద్ద హిట్. ఆ తర్వాత 'సర్కస్' చేశారు గానీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. (Image Courtesy : itsrohitshetty / instagram)
'సింగం ఎగైన్' సినిమాలో అజయ్ దేవగణ్, దీపికా పదుకోన్ భర్త రణవీర్ సింగ్ హీరోలు. సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడితో వాళ్ళిద్దరూ! (Image Courtesy : itsrohitshetty / instagram)
'సింగం ఎగైన్' సినిమా పూజా కార్యక్రమాల్లో అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి (Image Courtesy : itsrohitshetty / instagram)