Ramajogayya Sastry: రామజోగయ్యశాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో తారల సందడి - స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి, బాలయ్య
Chiranjeevi and Balakrishna at Ramajogayya Sastry Son Wedding Reception: ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు ఓ ఇంటివాడు అయ్యాడు.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, బ్రహ్మానందం, అడివి శేషు, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు వంటి ప్రముఖులు హాజయ్యారు.
ఈ రోజు(ఆగస్టు 24న) అతడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకి టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరై కొత్త జంటను ఆశీర్వాదించారు.
అలాగే డైరెక్టర్స్ ఎస్వీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ విజయ్ భాస్కర్, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మెహర్ రమేష్, నటుడు సాయి కుమార్ వంటి తదితరులు హాజరై వధువరులను ఆశీర్వదించారు.
అదేవిధంగా సింగర్స్ రామ్ మిర్యాల, శ్రీ కృష్ణ, అర్మాన్ మాలిక్, సింగర్ రేవంత్, అనంత్ శ్రీరామ్ , ధనుంజయ్ , రమ్య బెహ్రా, శ్రీరామ్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఇలా ఒకేచోట టాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా ఒక్కచోట కనిపించడంతో పెళ్లి వచ్చిన అతిథులందరికి కనుల పండగా అనిపించింది.
ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరిని ఒకే వేదికపై చూడటంతో నందమూరి, మెగా ఫ్యాన్స్ అంతా పండగా చేసుకుంటున్నారు.
రామజోగస్య శాస్త్రీ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో టాలీవుడ్ తారల సందడి. ఫోటోలు వైరల్
రామజోగస్య శాస్త్రీ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో టాలీవుడ్ తారల సందడి. ఫోటోలు వైరల్