✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss Gautham Krishna: 'సోలో బాయ్'తో హీరోగా బిగ్ బాస్ గౌతమ్ - టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ వేస్తే 30 వేలు... ఛాలెంజ్‌కి రెడీనా?

S Niharika   |  24 Aug 2024 06:13 PM (IST)
1

'బిగ్ బాస్ 7' కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ నిర్మిస్తున్న సినిమా 'సోలో బాయ్'. శ్వేతా అవస్థి కథానాయిక. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జుడా షాండి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 'ఆట' సందీప్ నృత్య దర్శకుడు. తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. హైలైట్ ఏమిటంటే... టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ ఛాలెంజ్ కూడా!

2

'సోలో బాయ్' సినిమా టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ గురించి నృత్య దర్శకుడు 'ఆట' సందీప్ మాట్లాడుతూ... ''హుక్ స్టెప్ ఛాలెంజ్ చేసిన వాళ్లకు మొదటి బహుమతిగా రూ. 30 వేలు, రెండవ బహుమతిగా రూ. 20 వేలు, మూడో బహుమతిగా రూ. 10 వేలు ఇస్తాం'' అని చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూ... ''నాకు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన 'సెవెన్ హిల్స్' సతీష్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన ఎంతో పాషనేట్ ప్రొడ్యూసర్. 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు 'సోలో బాయ్ టైటిల్ సాంగ్ నువ్వే చేయాలి' అని నాకు గౌతమ్ ఇచ్చిన మాటను ఇవాళ నిలబెట్టుకున్నాడు. గౌతమ్ డాన్స్ ఇరగదీశాడు. భవిష్యత్తులో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు'' అని చెప్పారు.

3

నిర్మాత 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ మాట్లాడుతూ... ''సోలో బాయ్' మంచి సినిమా. దీని కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడ్డారు. నాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థాంక్స్. ఇప్పుడు విడుదల చేసిన 'సోలో బాయ్' ఫస్ట్ సాంగ్ / టైటిల్ సాంగ్ చూసిన ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నా తమ్ముడు గౌతమ్ కృష్ణ ఈ 'సోలో బాయ్'తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రేక్షకులు అందరికీ నచ్చేలా నవీన్ సినిమా తీశాడు'' అని చెప్పారు.

4

'బిగ్ బాస్' ఫేమ్, హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ... ''హుక్ స్టెప్ ఛాలెంజ్ చేసి, మా మూవీ టీంని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాళ్ళలో బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతి ఇస్తాం. సందీప్ మాస్టర్ నాలో డ్యాన్సర్‌ను బయటకు తీసుకు వచ్చారు. ఈ టైటిల్ సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాయగా... రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడాడు. వాళ్లిద్దరికీ థాంక్స్'' అని చెప్పారు. హీరోయిన్ శ్వేతా అవస్థి మాట్లాడుతూ... ''నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు నవీన్ గారికి థాంక్స్. గౌతమ్ కృష్ణ యాక్టివ్ పర్సన్. డాన్స్ బాగా చేశాడు'' అని చెప్పారు.

5

గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి జంటగా నటించిన 'సోలో బాయ్' సినిమాలో రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు ప్రధాన తారాగణం.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Bigg Boss Gautham Krishna: 'సోలో బాయ్'తో హీరోగా బిగ్ బాస్ గౌతమ్ - టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ వేస్తే 30 వేలు... ఛాలెంజ్‌కి రెడీనా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.