Vaishnavi Chaitanya : కోకాపేటలో 'బేబీ' బ్యూటీ వైష్ణవి చైతన్య సందడి
'బేబీ' సినిమాతో తెలంగాణ అమ్మాయి వైష్ణవి చైతన్య బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ ఒక్క సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకు వచ్చింది. 'బేబీ' విడుదలకు ముందు వైష్ణవి చైతన్య కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలు చేశారు. అయితే... కథానాయికగా పరిచయమైన 'బేబీ' ఆమె కెరీర్ టర్న్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'బేబీ' బ్యూటీ వైష్ణవి చైతన్య ఆదివారం కోకాపేటలో సందడి చేశారు. ఆమెతో పాటు 'బేబీ' హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా ఉన్నారు. వాళ్ళు కోకాపేట ఎందుకు వెళ్ళారంటే?
కోకాపేటలో సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ ఆస్పత్రి ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin)తో కలిసి వైష్ణవి చైతన్య ప్రారంభించారు.
స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తే ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు, ఇతర దేశాలకు వెళ్లేవారని... ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మోడ్రన్ టెక్నాలజీతో కూడిన ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిందని వైష్ణవి చైతన్య తెలిపారు.
సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో వైష్ణవి చైతన్య శారీలో సందడి చేశారు.
వైష్ణవి చైతన్య కొత్త ఫోటోలు
వైష్ణవి చైతన్య కొత్త ఫోటోలు
హైదరాబాద్ నగర వాసుల అవసరాలు తీర్చేందుకు సిటీలో మరిన్ని శాఖలు ఓపెన్ చేస్తామని సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ రాజ్ కిరీటి ఈ. పి., డాక్టర్ శ్రీదేవి తెలిపారు.