Atlas Cycle Attagaru Petle: 'అట్లాస్ సైకిల్' వచ్చేస్తోంది - 'అనగనగా' ఫేం కాజల్ చౌదరి కొత్త మూవీ స్టార్ట్
యంగ్ టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు డిఫరెంట్ స్టోరీస్‌తో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు. కౌసల్య కృష్ణమూర్తి, అథర్వ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం కొత్త మూవీ 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లె' మూవీని ప్రారంభించారు.
ఈ మూవీలో అనగనగా ఫేం కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తుండగా.. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను శుక్రవారం గ్రాండ్ లాంచ్ చేశారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఈ వేడుకలకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టగా.. హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తొలి షాట్‌కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
1980 వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ రాజా దుస్సా తెలిపారు. ఇదో పీరియాడికల్ యాక్షన్ మూవీ అని.. కామెడీతో పాటు ఎమోషనల్ కూడా ఉంటుందని అన్నారు.
తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ కురిపిస్తున్నారని హీరోయిన్ కాజల్ చౌదరి అన్నారు. ఇది ఒక యునిక్ స్టోరీ అని.. మంచి టీంతో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.