Amala Paul: భర్తకి లిప్‌లాక్ - రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన అమలా పాల్

Images Credit: amalapaul/Instagram
Amala Paul Photos: హీరోయిన్ అమలా పాల్ తన ఫస్ట్ మీట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో భర్తకి లిప్‌లాక్ ఇస్తూ దిగిన రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసింది.
ఆగస్టు 11న వారి ఫస్ట్ మీట్ యానివర్సరీతో పాటు తమ కుమారుడు రెండు నెలల సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది. అయితే, ఆలస్యంగా ఈ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.
దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా గత ఏడాది నవంబర్ జగత్ దేశాయ్ (2023) నవంబర్ 6న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి చేసుకోవడానికి పది రోజుల ముందు అమలా పాల్ పుట్టినరోజునే అక్టోబర్ 26న ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్ దేశాయ్. అప్పుడు పెళ్లికి 'ఎస్' చెప్పాను అంటూ అమలా పాల్ తెలిపింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత పెళ్లైన రెండు నెలలకు తాను గర్భవతి అని ఆమె వెల్లడించారు. పెళ్లయిన మూడు నెలలకే బేబి బంప్ ఫోటోలు షేర్ చేసింది.
దీంతో అంతా షాక్ అయ్యారు. రెండు నెలల క్రితం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.