Alia-Ranbir Wedding Pics: సీతమ్మ పెళ్లంట, ఊరంతా సంబరమంట - అలియా, రణ్‌బీర్ పెళ్లి చిత్రాలివే!
RRR సినిమాలో సీతగా ఆకట్టుకున్న అలియా భట్.. గురువారం తన రాముడి చెంతకు చేరింది. తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. - Image Credit: Alia Butt/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగురువారం (ఏప్రిల్ 14)న రణబీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తు బిల్డింగ్‌లో వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, ఆకాష్ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహం చాలా సీక్రెట్ గా జరిగింది. - Image Credit: Alia Butt/Instagram
పెళ్లి జరిగేవరకు ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఫైనల్ గా వీరి పెళ్లి ఫొటో బయటకొచ్చింది. ఇది చూసిన అభిమానులు రణబీర్-అలియాలను శుభాకాంక్షాలతో ముంచెత్తుతున్నారు. - Image Credit: Alia Butt/Instagram
ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. ముందుగా పితృ పూజ చేశారు. ఆ తరువాత మెహందీ ఫంక్షన్ ను నిర్వహించారు. - Image Credit: Alia Butt/Instagram
పెళ్లిలో తన భార్యకు రణబీర్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. 8 వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్ ను ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. - Image Credit: Alia Butt/Instagram
పెళ్లిలో అలియా ఈ బ్యాండ్ ను ధరించింది. సబ్యసాచి రూపొందించిన పెళ్లి దుస్తులను ఈ జంట ధరించింది. - Image Credit: Alia Butt/Instagram
మొత్తానికి ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైంది. - Image Credit: Alia Butt/Instagram
ఇక వీరిద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. - Image Credit: Alia Butt/Instagram
'బ్రహ్మాస్త్ర'లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. రణ్‌బీర్, ఆలియా వివాహం సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' తొలి భాగం నుంచి 'కేసరియా' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. - Image Credit: Alia Butt/Instagram
అలియాను ఎత్తుకుని మండపానికి వెళ్తున్న రణ్‌బీర్ - Image Credit: Credit: Manav Manglani
అలియా, రణ్‌బీర్ పెళ్లి ఫొటోలు - Image Credit: Credit: Manav Manglani
అలియా, రణ్‌బీర్ పెళ్లి ఫొటోలు - Image Credit: Credit: Manav Manglani
అలియా, రణ్‌బీర్ పెళ్లి ఫొటోలు - Image Credit: Credit: Manav Manglani