Aishwarya Lekshmi: క్లోజప్ లుక్‌లో ఐశ్వర్య లక్ష్మి కవ్వింపులు - ఎల్లో డ్రెస్‌లో మతిపోగొడుతున్న 'అమ్ము'
Aishwarya Lekshmi Latest Photos: సౌత్ ఇండస్ట్రీలో నటి ఐశ్వర్య లక్ష్మికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. డాక్టర్ చదివిన ఈ అమ్మడు యాక్టర్ అయ్యింది.
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు నిర్మాతగానూ రాణిస్తుంది. తమిళ, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్‌లు అందుకుంటుంది.
'అమ్ము', 'పొన్నియన్ సెల్వన్', 'మట్టికుస్తి' లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. ఇక పొన్నియన్ సెల్వన్‌లో చేసింది చిన్న పాత్ర అయినా తన నటనతో ఆకట్టుకుంటుంది.
మొత్తానికి ఈ డాక్టర్ అమ్మ.. యాక్టర్ అయ్యి ఇండస్ట్రీలో సక్సెఫుల్ నటి అనిపించుకుంది. ఇదిలా ఉంటే అప్పుడు ఈ సౌత్ బ్యూటీ నెట్టింట గ్లామర్ టచ్ ఇస్తుంది. తాజాగా ఈ ఐశ్వర్య లక్ష్మి ఎల్లో డ్రెస్‌లో మెరిసింది.
క్లోజ్ లుక్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ భామ తన అందంతో ఆకట్టుకుంటుంది. ఎల్లో డ్రెస్‌లో ముద్దబంది పువ్వులా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి.