Siddharth Aditi Rao Hydari: యాపిల్ ఈవెంట్‌లో లవ్ బర్డ్స్... టిమ్ కుక్‌తో సిద్ధూ, అదితి రావ్ హైదరి
లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి గురించి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఆడియన్స్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్లిద్దరూ అమెరికా వెళ్లారు.
అమెరికాలో జరిగిన యాపిల్ ఈవెంట్‌కు సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి అటెండ్ అయ్యారు. అక్కడ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలిశారు. ఈ ఫోటోలను సిద్ధార్థ్, అదితి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తామిద్దరం యాపిల్ ఫ్యాన్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి పేర్కొన్నారు. ఫస్ట్ టైమ్ యాపిల్ ఈవెంట్‌కు వెళ్లామని తెలిపారు. ఆ కార్యక్రమం మొదలు కావడానికి ముందు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
యాపిల్ కుటుంబాన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి చెప్పారు. వాళ్లిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టిమ్ కుక్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి నవ్వులు. మరి, ఆయనతో వీళ్లిద్దరూ ఏం మాట్లాడారో? ఇండియా వస్తే తెలుస్తుంది.