Hansika Motwani: హన్సిక షాకింగ్ లుక్ - దేసి లుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన యాపిల్ బ్యూటీ
Hansika Latest Photos: పెళ్లి తర్వాత హన్సిక మోత్వానీ మరింత యాక్టివ్ అయ్యింది. సినిమాల్లో కాదండోయ్. సోషల్ మీడియాలో. తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
అంతేకాదు గ్లామర్ షోకి సైతం ఏమాత్రం వెనకాడటం లేదు. భర్తతో కలిసి వేకేషన్‌కు వెళ్లిన ఫోటోలు, అలాగే ఎలాంటి ఈవెంట్‌కి వెళ్లిన ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.
వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హాట్‌ట్రీట్ ఇస్తుంది. తాజాగా హన్సిక్ దేసి లుక్‌లో షాక్ ఇచ్చింది. మల్టీకలర్ వేర్‌లో మల్లెపూలు మాలతో, తలపై వెయిల్ ధరించింది అందంగా ముస్తాబైంది.
ఇందులో హన్సిక్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.కొత్త పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉందో ఆంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది హన్సిక. అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
ఆ తర్వాత బిల్లా, మస్కా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళ్‌లోనూ ఎన్నో సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
కోలీవుడ్‌లో లేడీ ఒరియంటెడ్ సినిమాలు చేసి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. నటిగా రాణిస్తున్న సమయంలో బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
పెళ్లి తర్వాత ఆడపదడప సినిమాలు చేసిన హన్సిక ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈటీవీలో ఢీ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యహరిస్తుంది.
దేసి లుక్‌లో హన్సిక మోత్వానీ షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (image Source: ihansika/Instagam)