Naveen Chandra: నవీన్ చంద్ర నటనకు దక్కిన గౌరవం... నెక్స్ట్ 'గేమ్ ఛేంజర్'తో పాన్ ఇండియా లెవల్‌కు
నవీన్ చంద్ర... ప్రేక్షకులు మెచ్చిన యువ కథానాయకుడు. ఆయన నటనకు తెలుగు జనాలు ఎప్పుడో ఫిదా అయ్యారు. 'అందాల రాక్షసి' చూసి 'ఎవరీ కుర్రాడు... భలే చేశాడు' అన్నారు. తర్వాత ఒక్కో సినిమాతో ప్రేక్షకుల్లో నటుడిగా తనకు ప్రత్యేక గౌరవం సొంతం చేసుకున్నారు. ఇటీవల 'ఇన్స్పెక్టర్ రిషి' వెబ్ సిరీర్తో ఓటీటీనీ షేక్ చేశారు. ఇప్పుడు ఆయన నటనకు మరో గౌరవం దక్కింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనవీన్ చంద్ర హీరోగా నటించిన 'మంత్ ఆఫ్ మధు' సినిమా ఉందిగా! ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరమైన బాధలో మద్యానికి బానిసైన భర్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. భార్య మీద ప్రేమతో చివరకు విడాకులు ఇచ్చే వ్యక్తి పాత్ర అది. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. 'మంత్ ఆఫ్ మధు'లో నవీన్ చంద్ర నటనకు గాను ప్రతిష్టాత్మక దాదా సాహేబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది.
నవీన్ చంద్ర నటనకు ప్రేక్షకులు ఎప్పుడో క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు ఈ అవార్డు ఆయన నటనకు, ప్రతిభకు దక్కిన గౌరవంగా ప్రేక్షకులు, పరిశ్రమలో ఆయన సన్నిహితులు చూస్తున్నారు.
'అందాల రాక్షసి' నుంచి లేటెస్ట్ 'ఇన్స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ వరకు... ప్రతి ప్రాజెక్టుతో నవీన్ చంద్ర నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నారు. ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో నవీన్ చంద్ర స్టార్. ఒక వైపు హీరోగా కంటెంట్ బేస్డ్ కథల్లో నటిస్తూ... మరో వైపు స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'తో నెక్స్ట్ పాన్ ఇండియా లెవల్ కు వెళుతున్నారు.
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సత్యభామ' సినిమాలో ఆమెకు జోడీగా నవీన్ చంద్ర యాక్ట్ చేస్తున్నారు. మే 17న ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవీన్ చంద్ర లేటెస్ట్ ఫోటోలు