Swathi Reddy Photos: 'కలర్స్' స్వాతి క్యూట్ ఫోటోలు!
చిన్నవయసులోనే బుల్లితెరపై 'కలర్స్' ప్రోగ్రామ్ తో పాపులర్ అయిన స్వాతి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'డేంజర్' సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన స్వాతి ఆ తరువాత 'అష్టా చమ్మా', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', 'స్వామిరారా', 'కార్తికేయ' లాంటి సినిమాల్లో నటించింది.
తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు అందుకుంటున్న సమయంలో పైలట్ వికాస్ ను పెళ్లాడింది.
పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. భర్తతో పాటు జకార్తాలో సెటిల్ అయిన ఈ బ్యూటీ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
స్వాతి కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిన 'కార్తికేయ' సీక్వెల్ లో ఆమె నటించబోతుంది. అలానే 'పంచతంత్రం' అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమాల కోసం అమ్మడు తన లుక్ ను మార్చుకుంది. ఒకప్పుడు ఎంతో క్యూట్ గా బబ్లీగా ఉండే కలర్స్ స్వాతి ఇప్పుడు బాగా బక్కగా తయారైంది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమెకి ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చిందా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నించారు.
కానీ అందులో నిజం లేదు. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడం కోసమే ఆమె తన లుక్ ను పూర్తిగా మార్చుకుంది.