November Birthday Calender: ఐశ్వర్య , షారుఖ్, టబు సహా నవంబర్ లో సినీ తారల పుట్టిన రోజుల లిస్ట్ ఇదిగో!
ఈ నెలలో మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ తన పుట్టినరోజు ఉంది. నవంబర్ 1న ఐశ్వర్యారాయ్ కి 52 ఏళ్లు పూర్తవుతుంది
నవంబర్ 1 న పుట్టిన మరో సెలబ్రెటీ బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ ఇషాన్ ఖట్టర్. ఈ నవంబర్ 1 తో ఇషాన్ ఖట్టర్ వయస్సు 30 సంవత్సరాలు అవుతుంది.
ఈ నెలలోనే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు. నవంబర్ 2న నటుడు తన 60వ పుట్టినరోజును జరుపుకుంటారు.
టబు పుట్టినరోజు నవంబర్ 4. ఈ ఏడాదితో 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.
శ్రీదేవి బోనీ కపూర్ ల కుమార్తె ఖుషి కపూర్ పుట్టినరోజు నవంబర్ 5. ఇది ఖుషికి 25వ పుట్టినరోజు
పాన్ ఇండియా స్టార్ కమల్ హాసన్ పుట్టినరోజు కూడా నవంబర్ నెలలోనే వస్తుంది. నవంబర్ 7న 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు.
బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా కూడా ఈ నెలలో తన పుట్టినరోజు జరుపుకోనుంది. నవంబర్ 13న 58 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.
బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ పుట్టినరోజు నవంబర్ 16న వచ్చింది. ఈ ఏడాది 40వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.
తారా సుతారియా పుట్టినరోజు నవంబర్ 19...ఈ రోజున ఆమె 30 ఏళ్ళకు చేరుకుంటుంది.
బాలీవుడ్ 'చందూ ఛాంపియన్' .. కార్తీక్ ఆర్యన్ కూడా నవంబర్ నెలలో తన పుట్టినరోజు జరుపుకుంటారు. నవంబర్ 22న 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు.