Second Hand Car Buying Tips పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
మీరు పాత కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, దానిని కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ముఖ్యం. మొదట, RC, బీమా పత్రాలు, కాలుష్య ధృవీకరణ పత్రం సర్వీస్ రికార్డ్‌లతో సహా కారు డాక్యుమెంట్‌లను తనిఖీ చేయండి. కారుపై ఏదైనా చట్టపరమైన సమస్య లేదా బకాయిలు ఉన్నాయో లేదో చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకారును లోన్ మీద తీసుకుంటే, ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కాపీని తప్పనిసరిగా తీసుకోండి. దీనితో పాటు, కారు ఫిజికల్ స్థితిని జాగ్రత్తగా పరిశీలించండి. కేవలం బయట మెరుస్తూ కనిపించడం మాత్రమే కారు మంచిదని కాదు.
ఇంజన్ శబ్దం, బ్రేకులు, సస్పెన్షన్, టైర్ల పరిస్థితిని బాగా తనిఖీ చేయండి. సెకండ్ హ్యాండ్ కారును కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేసి డ్రైవింగ్ సాఫీగా ఉందా లేదా అని తెలుసుకోండి. కారు నడిచిన కిలోమీటర్లను జాగ్రత్తగా చూడండి. కారు చాలా దూరం నడిచినట్లయితే, భవిష్యత్తులో మీరు నిర్వహణపై ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు.
ఈ మధ్య కాలంలో కార్ల ఓడోమీటర్లతో కూడా చేతులు మారిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే సర్వీస్ సెంటర్ నుంచి మైలేజ్ ను తప్పనిసరిగా పరిశీలించండి. కార్ల సర్వీస్ హిస్టరీ కూడా చాలా ముఖ్యం. కారుకు రెగ్యులర్ సర్వీసింగ్ జరిగిందా లేదా అని కూడా తెలుసుకోండి.
దీనివల్ల కారును ఎంత బాగా చూసుకున్నారో ,ఏ భాగాలు మార్చారో తెలుస్తుంది. కారు బీమాను బదిలీ చేయడం మర్చిపోవద్దు. పాత కారు కొన్న తర్వాత పాత యజమాని పేరు మీద బీమా ఉండకూడదు.
ఆర్టీఓలో వెళ్లి ఫాం నింపి, బీమా మీ పేరు మీద చేయించుకోండి. తద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఇబ్బంది ఉండదు. కారు ధర విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. వివిధ డీలర్ల నుంచి ధరలను సరిపోల్చండి. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటే నష్టం జరగదు.