Narayan Das Narang: ప్రముఖ నిర్మాత మృతి - నివాళులు అర్పిస్తున్న సెలబ్రిటీలు
ABP Desam | 19 Apr 2022 07:44 PM (IST)
1
ఏషియన్ సినిమాస్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె. నారంగ్ ఇక లేరు.
2
ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 సంవత్సరాలు.
3
అనారోగ్య సమస్యలతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ సిటీలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు.
4
వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో మరణించినట్టు తెలుస్తోంది.
5
సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ చేశారు.
6
ఇటీవల నాగచైతన్య 'లవ్ స్టోరీ', నాగశౌర్యతో 'లక్ష్య' సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో 'ఘోస్ట్', ధనుష్ తో ఓ భారీ సినిమా నిర్మిస్తున్నారు.
7
ఇప్పుడు ఆయన మరణించడంతో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
8
అలానే కొందరు ఆయన ఇంటికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
9
ప్రముఖ నిర్మాత మృతి - నివాళులు అర్పిస్తున్న సెలబ్రిటీలు