Photos: రెండొందల యాభైమందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించిన సుమ
ప్రముఖ యాంకర్ సుమ కనకాల 'ఫెస్టివల్స్ ఫర్ జాయ్' అనే స్వచ్ఛంద సేవా సంస్థను విజయదశమి సందర్భంగా ప్రారంభించారు. 'పద్మశ్రీ' పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న 10మంది మహిళలకు ధన సహాయం చేయడంతో పాటు అక్కడి పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఏర్పాటు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిసెంబర్ 5, ఆదివారం ఆదివారం నాడు గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో సినిమా, టీవీ ఇండస్ట్రీలకు చెందిన 250 మందికి సుమ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.
రెండొందల యాభై మందికి టెస్టులు చేయగా... పదిమందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు డాక్టర్ ప్రమీల, డాక్టర్ చినబాబు తెలిపారు.
క్యాన్సర్ లక్షణాలు కనిపించిన పది మందికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి... మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా తరపున తానా ట్రస్టీ విద్య గారపాటి పాల్గొన్నారు.