Sudigali Sudheer Adivi Sesh: 'సుడిగాలి' సుధీర్ కంటే ముందు అడివి శేష్‌కు ఈ కథ చెప్పా - దర్శకుడు అరుణ్ విక్కిరాల
'సుడిగాలి' సుధీర్ హీరోగా షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన సినిమా 'కాలింగ్ సహస్ర'. డాలీ షా హీరోయిన్. డిసెంబర్ 1న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడిగా పరిచయం అవుతున్న అరుణ్ విక్కిరాలా మీడియాతో ముచ్చటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'కాలింగ్ సహస్ర' టైటిల్ ఎందుకు పెట్టామంటే... సినిమాలో మొబైల్ నెట్వర్క్ కంపెనీ పేరు కాలింగ్. డాలీ షా కాకుండా మరో హీరోయిన్ పేరు సహస్త్ర. ఆమె కోసం హీరోకి ఫోన్స్ వస్తాయి. అందుకని, 'కాలింగ్ సహస్ర' అని పెట్టాం. సహస్ర రోల్ ఎవరు చేశారో? సినిమాలో చూడాలి.
కంటెంట్ బేస్డ్ స్టోరీ ఇది. కథను ముందు అడివి శేష్ (Adivi Sesh)కు వినిపించా. ఆయనకు నచ్చింది. కానీ, అప్పుడు నిర్మాతలతో కుదరలేదు. తర్వాత 'సుడిగాలి' సుధీర్ దగ్గరకు వెళ్లాను. ఆయనకు కథ నచ్చింది. కానీ, తాను ఆ పాత్రకు సూట్ అవుతానా? లేదా? అని సందేహించారు. అప్పుడు నాకు 'త్రీ మంకీస్'కు మాటలు రాసే అవకాశం వచ్చింది. సుధీర్, నాకు మధ్య మరింత పరిచయం పెరిగింది. సినిమా ఒకే చేశారు.
'కాలింగ్ సహస్ర' మొదలైన 10 నిమిషాలకు 'సుడిగాలి' సుధీర్ ఇమేజ్, అతడిని ప్రేక్షకులు మరిచిపోతారు. ఆయన పాత్రతో కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో సుధీర్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించడు. ఆయన కామెడీ కూడా చేయలేదు. అందరికీ సినిమా నచ్చుతుంది. సుధీర్ కాకుండా శివ బాలాజీ గారి పాత్ర, డాలీ షా కారెక్టర్లకు మంచి పేరు వస్తుంది. డాలీ షా ఓ ఫైట్ సీక్వెన్స్ చేసిన తర్వాత ఫైట్ మాస్టర్ క్లాప్స్ కొట్టేశాడు. ఆ షాట్ అంత బాగా వచ్చింది.
'కాలింగ్ సహస్ర'లో చాలా ట్విస్టులు ఉంటాయి. వాటితో పాటు మంచి ప్రేమకథ కూడా ఉంది. ట్విస్టులు తెలిసినా... ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారు. అందులో సందేహం లేదు. సినిమాలో సందేశం ఉంది కానీ అది అంతర్లీనంగా ఉంటుంది. మార్క్ కె. రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో హైలైట్
'కాలింగ్ సహస్ర' దర్శకుడు అరుణ్ విక్కిరాల