Deepthi Sunaina: ప్రకృతి మధ్యలో ఉయ్యాల ఊగుతున్న దీప్తి సునయన - ఏముందంటున్న నెటిజన్స్
Deepthi Sunaina Latest Photos: యూట్యూబ్ స్టార్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్‌కి ఈమే బాగా సుపరిచితం.(Image Source: deepthi_sunaina/Instagram)
ప్రైవేట్ అల్బమ్ చేస్తూ యూబ్యూబర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే తన లేటెస్ట్ ఫోటోలు, గ్లామరస్ పిక్స్ షేర్ చేసి నెట్టింట హీట్ పెంచేస్తుంది. తన క్యూట్ క్యూట్ స్మైల్, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్, హెవీ డోస్ గ్లామర్‌తో కుర్రకారు మనసులో అల్లాకల్లోలం సృష్టిస్తుది.(Image Source: deepthi_sunaina/Instagram)
దీంతో సోషల్ మీడియాలో ఈ బిగ్‌బాస్ భామకు ఎంతో మంది నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. తాజాగా నేచర్‌ని ఆస్వాధిస్తున్న అందమైన ఫోటోలు షేర్ చేసింది.(Image Source: deepthi_sunaina/Instagram)
ప్రకృతి మధ్యలో ఉయ్యాల ఊగుతున్న ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆమె లుక్‌కి కుర్రకారు ఫిదా అవుతుంది. (Image Source: deepthi_sunaina/Instagram)
ప్రకృతి మధ్యలో నువ్వులా ఉయ్యాల ఊగుతుంటే మా మనసులో వీణలు మోగుతున్నాయంటూ కవిత్వం రాసేస్తున్నారు ఫ్యాన్స్. కాగా, కెరీర్ ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది.(Image Source: deepthi_sunaina/Instagram)
ఇక యూట్యూబర్ షణ్మఖ్ జశ్వంత్‌తో కలిసి ట్రెండీంగ్ పాటలు రీమేక్ చేసి పాపులారిటీ సంపాదించుకుంది. అదే క్రేజ్‌లో బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. ఈ రియాలిటీ షోతో ఆమె లైమ్‌లైట్లోకి వచ్చింది.(Image Source: deepthi_sunaina/Instagram)
అప్పటి నుంచి ఈ భామ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. మరోవైపు ప్రైవేటు అల్బం సాంగ్స్ చేస్తూ నటిగానూ ప్రూవ్ చేసుకుంటుంది. ఇకపోతే షణ్ముఖ్ జశ్వంత్‌తో లవ్ బ్రేక్‌ప్‌తో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది.(Image Source: deepthi_sunaina/Instagram)
ఏ షోతో వాళ్లు పాపులర్ అయ్యారో అదే బిగ్‌బాస్ షో వల్లే వీరిద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నెటిజన్లు కళ్లు మొత్తం ఈ మాజీ లవర్స్‌పైనే ఉన్నాయి. వీరిద్దరు ఎప్పుడు కలుస్తారా? ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.(Image Source: deepthi_sunaina/Instagram)