Bigg Boss 8 Nikhil Maliyakkal : బిగ్ బాస్ సీజన్ 8 కప్ సీరియల్ హీరో నిఖిల్ కొట్టేస్తాడా.. మనోడి బ్యాగ్రౌండ్ అట్లుంది మరి!
బిగ్బాస్ సీజన్ 8 అడుగుపెట్టాడు ఊర్వశివో రాక్షసివో సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్. కృష్ణ ముకుంద మురారి ఫేమ్ యష్మీ గౌడతో కలసి జంటగా హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోరింటాకు సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్..రీసెంట్ గా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సీరియల్ తో మరింత పాపులర్ అయ్యాడు.
నిఖిల్ సొంతూరు కర్ణాటకలో మైసూర్... 'మనయే మంత్రాలయ' అనే కన్నడ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై నట జీవితం ప్రారంభించిన నిఖిల్ తెలుగులో గోరింటాకు సీరియల్ తర్వాత కలిసివుంటే కలదు సుఖం సీరియల్ లోనూ నటించాడు. ఊర్వశివో రాక్షసివో సీరియల్ తో పాటూ స్రవంతిలోనూ నటిస్తున్నాడు.
స్టార్ మా లో ప్రసారమైన గేమ్ షోస్ , ఈవెంట్స్ లో నిఖిల్ తన పెరఫామెన్స్ తో సత్తాచాటాడు. రీసెంట్ ప్రోగ్రామ్ 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో కూడా నిఖిల్ సందడి చేశాడు.
గోరింటాకు సీరియల్ తో తనతో కలసి నటించిన కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే టాక్ ఉంది..ఆమె ఫాలోవర్స్ అంతా నిఖిల్ ని సపోర్ట్ చేస్తారు.
కాంతార హీరో రిషబ్ శెట్టి, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ షర్మిత గౌడ సహా చాలామంది కన్నడ నటులతో నిఖిల్ కి స్నేహం ఉంది.. దీంతో నిఖిల్ సపోర్టర్స్ లిస్ట్ పెద్దగానే ఉందిగా అంటున్నారు ప్రేక్షకులు.. సరిగ్గా ఆడితే కప్ మనోడిదే అని ఫిక్సైపోయారు...
సీరియల్ నటుడు నిఖిల్ (Image Credit: nikhilmaliyakkal/ Instagram)