Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5లో అడల్ట్ కంటెంట్ స్టార్..?
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇప్పటివరకు తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎప్పటిలానే కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో యాంకర్ రవి, వర్షిణి, లోబో, నవ్య స్వామి, సురేఖా వాణి ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు మరొకరి పేరు తెరపైకి వచ్చింది. మరెవరో కాదు యూట్యూబ్ స్టార్ సరయు.
తన బోల్డ్ కంటెంట్ తో ఫేస్ బుక్ లో, యూట్యూబ్ లో రచ్చ చేస్తోన్న ఈమెని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
నిజానికి ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. కంటెంట్ మరీ బోల్డ్ గా ఉంటుందనే విమర్శలు వస్తుంటాయి.
అలాంటి భామను ఇప్పుడు హౌస్ లోకి తీసుకొచ్చి మరింత రచ్చ చేయించాలని భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సెప్టెంబర్ నెల నుండి ఈ షోని టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.