Box Office Update : క్రిస్మస్ టు సంక్రాంతి.. బాక్సాఫీస్ బిజీ బిజీ..

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీపై ఎఫెక్ట్ బాగా పడింది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాలను క్రిస్మస్, సంక్రాంతి 2022 బరిలోకి దింపుతున్నారు. అలా అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In App
రాధేశ్యామ్ - ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జనవరి 14, 2022లో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

పుష్ప - అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాను రెండు భాగాలుగా విడుదల విడుదల చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ - పవన్ కళ్యాణ్, రానా కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను జనవరి 12, 2022లో విడుదల చేయనున్నారు.
ఎఫ్ 3 - వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను జనవరి 15, 2022లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కానీ హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి అనుకున్న టైమ్ కి వస్తుందో లేదో చూడాలి.
కేజీఎఫ్2 - ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాను 2021 డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు.
బంగార్రాజు - నాగార్జున,చైతు కలిసి నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారు. జనవరి 15, 2022లో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.
సర్కారు వారి పాట - మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022లో విడుదల చేయనున్నారు.
గని - బాక్సింగ్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను జనవరి 19న విడుదల చేయనున్నారు.
లైగర్ - విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో వస్తున్న ఈ సినిమాను జనవరి 19న విడుదల చేయాలనుకుంటున్నారు.
అఖండ - బాలయ్య నటించిన ఈ సినిమా కూడా జనవరి 15న వస్తుందని టాక్.
ఆచార్య - మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను కొరటాల శివ రూపొందిస్తున్నారు. అఫీషియల్ గా ఈ సినిమా డేట్ అనౌన్స్ చేయనప్పటికీ.. జనవరి 7న సినిమాను విడుదల చేస్తారని టాక్.