✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Dell Laptop: డెల్ నుంచి ల్యాప్‌టాప్‌లు.. గేమింగ్ లవర్స్‌కు పండగే..

ABP Desam   |  05 Aug 2021 01:24 PM (IST)
1

భారత మార్కెట్‌లోకి రెండు సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లు విడుదల అయ్యాయి. దిగ్గజ టెక్ కంపెనీ డెల్ వీటిని లాంచ్ చేసింది. డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్, డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6 పేరున్న ఈ ల్యాప్‌టాప్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి.

2

డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌.. ఏఎండీ రైజన్ ఆర్7-5800 హెచ్ సిరీస్ మొబైల్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6 ల్యాప్‌టాప్‌.. ఇంటెల్ కోర్ ఐ7-11800 హెచ్ టైగర్ లేక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3

డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్ ప్రారంభ ధరను రూ.1,34,990గా.. డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6 రైజన్ ఎడిషన్ ప్రారంభ ధరను రూ.1,59,990గా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లను డెల్ అధికారిక వెబ్ సైట్ (Dell.com) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

4

డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్.. 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లేతో రానుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,920x1,080 పిక్సెల్‌గా, రిఫ్రెష్ రేట్‌ 165 Hzగా ఉన్నాయి. వీటి బ్యాటరీ కెపాసిటీ 86 డబ్ల్యూహెచ్ఆర్ గా ఉంది. ఇందులో ఏలియన్‌వేర్ హెచ్‌డీ 720 పిక్సెల్ వెబ్ కామ్‌తో పాటు డ్యూయల్ ఎరే మైక్రో ఫోన్స్ ఉంటాయి. ఇందులో కిల్లర్ వైఫై 6, బ్లూటూత్ వీ 5.2, యూఎస్‌బీ టైప్ ఏ పోర్ట్స్, యూఎస్‌బీ టైప్ సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లేదా మిక్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

5

డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6.. 15.6 అంగుళాల క్యూహెచ్‌డీ + డిస్‌ప్లేతో రానుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2,560x1,440 పిక్సెల్‌గా, రిఫ్రెష్ రేట్‌ 240 Hzగా ఉన్నాయి.

6

ఇందులో యూఎస్‌బీ టైప్ ఏ పోర్ట్స్, థండర్ బోల్ట్ 4 పోర్టు, హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. వీటి బ్యాటరీ కెపాసిటీ 86 డబ్ల్యూహెచ్ఆర్ గా ఉంది. 240 వాట్స్ అడాప్టర్ కూడా ఉంటుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టెక్
  • Dell Laptop: డెల్ నుంచి ల్యాప్‌టాప్‌లు.. గేమింగ్ లవర్స్‌కు పండగే..
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.