AP Corona Cases: వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్.. కొత్తగా ఎన్ని కేసులంటే?
ABP Desam | 05 Aug 2021 09:05 AM (IST)
1
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 2 వేల 442 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కు మరో 16 మంది బలి అయ్యారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించారు. తాజాగా కరోనా నుంచి 2,412 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.