Bigg Boss Divi Photos: వెనీస్ వీధుల్లో తెలుగందం - చీరలో తళుక్కున మెరిసిన బీబీ బ్యూటీ దివి
ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన దివి.. ‘బిగ్ బాస్’ సీజన్-4తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తన ఆటపాటలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం దివి.. ఇటలీ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా వెనీస్ నగరాన్ని చుట్టేసింది. మోడ్రన్ డ్రెస్‌లో కాకుండా చీరలో ప్రత్యక్షమైంది. అచ్చ తెనుగు అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి. - Images Credit: Divi Vadthya/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా గులాబి రంగు లెహంగా చోళీలో మెరిసింది. తన ఫోటోలతో ఓ అందమమైన పాటను కూడా క్యాప్షన్ గా పెట్టింది
ఆకాశం అనే డబ్బింగ్ మూవీలోని 'వనమాలి చేయి తాకి కలువలోచనా' అంటూ సాగే పాట ఇది. ఈ పాటను తన క్యాప్షన్ గా పెట్టింది. ఆ పాటలాగానే దివి కూడా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపిస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారంతా.
సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)