Anasuya Bharadwaj: అందానికి అడ్రస్సులా అనసూయ - లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అనసూయ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామలో షేర్ చేశారు. ఇందులో ఆమె మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం అనసూయ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
2023లో అనసూయ నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కావడం విశేషం. ‘మైకేల్’ నుంచి ‘ప్రేమ విమానం’ వరకు అన్నిట్లోనూ అనసూయకు మంచి పాత్రలు దక్కాయి.
2013లో ప్రారంభం అయిన ‘జబర్దస్త్’తో అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా మెల్లగా వెతుక్కుంటూ వచ్చాయి.
2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’లో దాక్షాయణి పాత్ర అనసూయకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో కూడా అనసూయ సినిమాలు చేశారు.
మలయాళంలో మమ్ముట్టి ‘భీష్మ పర్వం’లో కూడా అనసూయ కీలకపాత్రలో కనిపించారు. తమిళంలో ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది.
దేశంలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పుష్ప 2’ ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై అనసూయ చాలా ఆశలు పెట్టుకున్నారు.