Alia Bhatt Photos : జాయ్ అవార్డ్స్ షోలో ఆలియా భట్.. డిఫరెంట్ స్టైల్లో చీరకట్టిన బ్యూటీ
ఆలియా భట్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Aliabhatt)
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జాయ్ అవార్డ్స్ షోలో పాల్గొంది. చీరకట్టును డిఫరెంట్ స్టైల్లో కట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. చీరకు తగ్గట్లు స్లీవ్ లెస్ బ్లౌజ్‌ను జత చేసింది. (Images Source : Instagram/Aliabhatt)
చెవులకు పెద్ద జుంకాలు పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్‌తో తన అందాన్ని సెట్ చేసుకుంది. హెయిర్‌కి మినిమల్ కర్ల్స్ ఇచ్చి లీవ్ చేసింది. కళ్లకు మస్కార పెట్టుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఆలియా.(Images Source : Instagram/Aliabhatt)
ఈ అవార్డ్ ఫంక్షన్లో ఈ భామ కూడా ఓ అవార్డు అందుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది ఆలియా. ఈ పోస్ట్‌కు To a night of culture, honour & cinema 🫶🏼✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Aliabhatt)
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించింది ఈ భామ. దాదాపు ఆమె నటించిన అన్ని సినిమాలు హిట్లుగా నిలిచాయి.(Images Source : Instagram/Aliabhatt)
కేవలం అందంతోనే కాకుండా నటనతో కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది ఆలియా. గంగూభాయి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. బెస్ట్ హీరోయిన్గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. చిన్ననాటి క్రష్ రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లాడింది.(Images Source : Instagram/Aliabhatt)
ఆలియా తెలుగులో కూడా తన ప్రస్థానం మొదలు పెట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్‌కు జోడిగా నటించింది. సీత అనే పాత్రలో ఒదిగిపోయింది. నిడివి తక్కువే అయినా తన నటనతో తెలుగులో అభిమానులను సంపాదించుకుంది ఆలియా.(Images Source : Instagram/Aliabhatt)