Rakul Preet Singh: భర్తతో కలిసి యోగాసనాలు- రకుల్ ఫిట్ నెస్ చూస్తే షాకవ్వాల్సిందే!
రకులు ప్రీత్ సింగ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫిట్ నెట్ కు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి రోజూ యోగా చేయడంతో పాటు జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది. తాను మాత్రమే కాదు, అందరూ ఫిట్ గా ఉండాలని పలు ప్రముఖ నగరాల్లో ఫిట్ నెస్ సెంటర్లు కూడా రన్ చేస్తుంది. Photo Credit: Rakul Singh/Instagram
నిత్యం రకరకాల యోగాసనాలు, కఠినమైన వర్కౌట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది రకుల్. ఫిట్ గా ఉంటేనే మంచి సినిమా అవకాశాలు వస్తాయని ఆమె బలంగా నమ్ముతుంది. Photo Credit: Rakul Singh/Instagram
తాజాగా ప్రపంచ యోగా దినోవత్సవాన్ని పురస్కరించుకుని తన భర్త జాకీ భగ్నానీతో కలిసి యోగాసనాలు వేసింది. ఇద్దరూ కలిసి కఠినమైన ఆసనాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. Photo Credit: Rakul Singh/Instagram
భార్యభర్త కలిసి చేసిన యోగాసనాల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Rakul Singh/Instagram