Nidhhi Agerwal: అందాల ‘నిధి’.. దాచాలనుకున్నా దాగని పరువం నీది!
ఆమె అందాన్ని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా.. ఆమె ‘ఇస్మార్ట్’ అందంతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ భామ మరెవ్వరో కాదు.. నిధీ అగర్వాల్. ఈ రోజు (ఆగస్టు 17) నిధీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిధీ అగర్వాల్ పుట్టింది హైదారబాద్లోనే. అయితే, ఆమె బాల్యమంతా బెంగళురులోనే గడిచింది. మార్వాడీ కుటుంబంలో జన్మించడం వల్ల ఆమె హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా మాట్లాడగలదు.
నిధీ అగర్వాల్ బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదివింది. కథక్, బెల్లీ డ్యాన్స్‌లో కూడా నిధీకి ప్రావిణ్యం ఉంది.
2016లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రంతో ఆమె సినీ రంగానికి పరిచయమయ్యారు. 2018లో నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది.
ఆ తర్వాత ఆఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’, రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో కనిపించింది. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటిస్తోంది. తమిళంలో ‘ఈశ్వరన్’, ‘భూమి’ సినిమాల్లో నటించింది.
అందాల ‘నిధి’.. దాచాలనుకున్నా దాగని పరువం నీది!
అందాల ‘నిధి’.. దాచాలనుకున్నా దాగని పరువం నీది!
అందాల ‘నిధి’.. దాచాలనుకున్నా దాగని పరువం నీది!
అందాల ‘నిధి’.. దాచాలనుకున్నా దాగని పరువం నీది!
అందాల ‘నిధి’.. దాచాలనుకున్నా దాగని పరువం నీది!