Anasuya Bharadwaj: నీలి రంగు చీరలో 'రంగమ్మత్త' సోగసులు - ఇచ్చిపడేసిన అనసూయ
Anasuya Latest Photos: నటి అనసూయ భరద్వాజ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.
నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో మాత్రం తరచూ ఏదోక వెకేషన్‌కు వెళుతుంది. ఈ క్రమంలో అనసూయ షేర్ చేసే ఫొటోలో నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. అదే క్రమంలో ఆమెపై విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
ఈ మధ్య ఎక్కువగా వేకెషన్స్‌కు వెళుతున్న ఆమె భర్తో చీల్ అవుతుంది. ఈ సందర్భంగా పొట్టి పొట్టి బట్టల్లో ఫుల్ గ్లామర్ షో చేస్తుంది. ఇక యాంకరింగ్ గుడ్‌బై చెప్పిన ఆమె ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది.
అయినా తనకు ఏం పట్టనట్టుగానే ఇంకా గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. అయితే తాజాగా అనసూయ చీరలో తెగ వయ్యారాలు పోయింది. నేడు విడుదలైన రజాకార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ యాంకరమ్మా పాల్గొంది.
నన్ను రీప్లేస్ చేయగలరని తెలుసుకోగలిగేంత వినయం.. అయితే, నాలా మాత్రం మరెవరూ చేయలేరని తెలుసుకునేంత తెలివి ఉంటే చాలు.. సరే కానీ 'రజాకార్' ట్రైలర్ చూశారా? అంటూ ట్రైలర్‌ను డిఫరెంట్‌గా ప్రమోట్ చేసింది.
ఇందులో చీరకట్టులో 'రంగమ్మత్త' స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈవెంట్ అనంతరం ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది.
అయితే అనసూయ ఇచ్చిన ఈ క్యాప్సన్ అర్థమేంటాని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చూస్తుంటే ఆమె ఎవరికో పరోక్షంగా కౌంటర్ ఇచ్చిందంటున్నారు. మరోవైపు ఈ సందర్భంగా చీరకట్టులో అనసూయ ఒలకబోస్తున్న సిగ్గులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.