Green India Challenge: మా బాధ్యత పూర్తైంది.. మీరు భాగస్వాములు కావాలంటున్న హీరో నాని
టీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇందుకోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా శ్యాం సింగరాయ్ మూవీ టీమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు అయ్యారు. జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జీహెచ్ఎంసీ పార్కులో హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్ తమ వంతుగా కొన్ని మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరు కొన్ని మొక్కలు నాటాలని, వాటికి నీళ్లు పోసి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు హీరో నాని.
ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు, పలు రంగాల సెలబ్రిటీలు తమ వంతుగా ఈ మహోద్యమంలో తమ వంతుగా పాల్గొంటున్నారు
ప్రజల్లో ఎంతో అవగాహన కలిగి వారు మొక్కల్ని నాటేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని హీరో నాని అన్నారు.
గ్లోబల్ వార్మిగ్ లాంటి వాతావరణ సమస్య అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దోహదపడుతుందని శ్యాం సింగరాయ్ టీమ్ చెప్పింది. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతలు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు.
ప్రకృతిపై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసించారు. శ్యాం సింగరాయ్ మూవీ డిసెంబర్ 24 థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.