Nitish Kumar Educational Qualification: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏం చదువుకున్నారు? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
నితీష్ కుమార్ 9 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బిహార్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన జనతాదళ్ యు రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నాయకులలో ఒకరు.
బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రిస జేడీయూ (JDU) అధినేత నితీష్ కుమార్ మార్చి 1, 1951 న పాట్నా జిల్లాలోని చిన్న పట్టణం భక్తియార్‌పూర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ ఒక ఆయుర్వేద వైద్యుడు. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
నితీష్ కుమార్ ఇంటి వాతావరణం సమాజసేవ, నిజాయితీతో నిండి ఉంది, ఇది బాల్యం నుంచే నితీష్‌ను ప్రజా జీవితంలోని విలువలతో పరిచయం చేసింది.
నితీష్ కుమార్ ప్రాథమిక విద్య ఆయన స్వస్థలమైన భక్తియార్‌పూర్‌లో జరిగింది. ఆ సమయంలో విద్యకు సంబంధించిన వనరులు పరిమితంగానే ఉన్నాయి, కానీ నితీష్ ఎల్లప్పుడూ కష్టపడి చదివే విద్యార్థిగా ఉండేవారు. ఆయన అంకితభావాన్ని చూసి ఉపాధ్యాయులు అతన్ని మరింత ముందుకు వెళ్ళమని ప్రోత్సహించారు. ఇక్కడి నుంచే అతని విద్యా ప్రయాణం కొత్త మలుపు తిరిగింది.
నితీష్ కుమార్ శ్రీ గణేష్ హైస్కూల్ నుంచి హైస్కూల్ పరీక్షను అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు తన తరగతిలో మొదటి స్థానంలో నిలిచారు. తరువాత, ఆయన పాట్నా సైన్స్ కళాశాలలో చేరారు, అక్కడ గణితం, విజ్ఞాన శాస్త్రంపై లోతైన ఆసక్తిని కనబరిచారు.
1972లో నితీష్ కుమార్ బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఇప్పుడు NIT పాట్నా) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. చదువుకునే రోజుల్లో ఆయన అనేక సాంకేతిక క్లబ్ లతో సంబంధం కలిగి ఉన్నారు. శక్తి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేశారు.
డిగ్రీ తర్వాత నితీష్ కుమార్ బిహార్ రాష్ట్ర విద్యుత్ విభాగంలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు, అక్కడ ఆయన విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇదే అనుభవం తరువాత ఆయన రాజకీయ విధానాలలో కూడా కనిపించింది.
నితీష్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయన తనతో పాటు ఒక ఇంజనీర్, ఆచరణాత్మక , విశ్లేషణాత్మక ఆలోచనను తీసుకువచ్చారు. ఆయన విధానాలు ఎల్లప్పుడూ డేటా, ప్రణాళిక. ఫలితంపై దృష్టి సారించాయి. శక్తి, రహదారి, నీటిపారుదల, విద్య వంటి రంగాలలో ఆయన విధానం సాంకేతికంగా బలంగా పరిగణించేవాళ్లు. అందుకే ప్రజలు ఆయన్ని ప్రేమతో వికాస్ పురుష్ అని పిలవడం ప్రారంభించారు.
ముఖ్యమంత్రి అయిన తరువాత, నితీష్ కుమార్ విద్యను అభివృద్ధికి మూలస్తంభంగా భావించారు. ప్రతి బిడ్డ చదవాలి, బిహార్ అభిృవద్ధి చెందాలి అనే నినాదంతో ముఖ్యమంత్రి కన్యా ఉత్తాన్ యోజన, సాక్షరతా మిషన్, సైకిల్ యోజన వంటి అనేక పథకాలను ప్రారంభించారు.